పేదల వైద్యానికి అండగా ఎమ్మెల్యే జారె.. 78 సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులు అందజేత
ప్రజల కష్టాలు తెలుసుకుని.. పరిష్కారం కోసం అధికారుల వద్దకు ఎమ్మెల్యే జారె అశ్వారావుపేట,పొలిటికల్ పవర్, ఆగస్టు 27: అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం స్వయంగా అధికారులను కలిసి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం కోరుతున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనారోగ్య బాధితుల నుంచి సేకరించిన 78 ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) దరఖాస్తులను...