POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 10:41 am Posted by : POLITICAL POWER

పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత వైఎస్సార్‌ – ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ డెస్క్ సెప్టెంబర్ 02 2026: డోర్నకల్ ఆఖరి శ్వాస వరకు పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పరితపించిన మహానేత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఆయన పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డాక్టర్ వైఎస్సార్‌ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తన జీవిత ధ్యేయంగా పనిచేశారని అన్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిన ప్రజానాయకుడిగా వైఎస్సార్‌ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు, అందించిన స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనివని అన్నారు. మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పేర్కొన్నారు.