పేద ప్రజల గుండె చప్పుడు ‘చల్లా కృష్ణన్న’.. బాధితుడికి తక్షణ ఆర్థిక సాయం! – మంత్రి పొంగులేటి అనుచరుడు తుంబురు దయాకర్ రెడ్డి సూచనతో రంగంలోకి చల్లా – “ప్రజాసేవే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం.. భవిష్యత్తులోనూ పేదలకు అన్ని రకాల అండగా ఉంటాం!”
ఖమ్మం (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - పాలేరు నియోజకవర్గ ప్రతినిధి): ఆపదలో ఉన్న పేదలకు ‘అక్షయ పాత్ర’లా మారుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలో సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జనరల్ సెక్రటరీ చల్లా కృష్ణ. నిరుపేదల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ తక్షణ సాయం అందించడంలో ఆయన చూపిస్తున్న చొరవ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితునికి అండగా.. తక్షణ రూ. 5,000 ఆర్థిక సాయం! ఖమ్మం పాలేరు నియోజకవర్గం 59వ డివిజన్ దానవాయిగూడెం...