–వనపర్తి బస్టాండ్‌లో దొరికిన నగదును నిజాయితీగా తిరిగి అప్పగింత
-హోంగార్డు శ్రీనివాసులు నిజాయితీకి పోలీసుల అభినందనలు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18 2026: వనపర్తి బస్టాండ్‌లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఓ వ్యక్తి పోగొట్టుకున్న రూ.7,500 నగదును నిజాయితీగా తిరిగి అందజేసి ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాసులు(హెచ్ జి 491) ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే, జూన్ 18న వనపర్తి బస్టాండ్‌లోని బైక్ పార్కింగ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రూ.7,500 నగదును పోగొట్టుకున్నాడు. ఆ డబ్బులు ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసులుకు దొరకడంతో, వెంటనే ఆయన బస్టాండ్ బైక్ పార్కింగ్ యజమానికి తన ఫోన్ నంబర్, చిరునామా వివరాలు ఇచ్చి, పట్టణ ఎస్సైకి సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పాన్‌గల్ మండల కేంద్రానికి చెందిన పేట బాలరాజ్ (తండ్రి: బుచ్చన్న) పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాడు. విచారణ అనంతరం డబ్బులు తనవేనని నిర్ధారించడంతో, పట్టణ ఎస్సై సమక్షంలో హోంగార్డు శ్రీనివాసులు బాధితుడు బాలరాజ్‌కు రూ.7,500 నగదును అప్పగించారు. ఈ సందర్భంగా హోంగార్డు శ్రీనివాసులు (హెచ్ జి 491) ప్రదర్శించిన నిజాయితీని స్థానికులు, పోలీసు అధికారులు అభినందించారు.