పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే10:
అనపర్తి నియోజకవర్గంలోని పోలమూరు గ్రామ దేవత శ్రీ శ్రీ వనుమలమ్మ అమ్మవారి వార్షిక అన్నసమారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు హాజరై అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పోలమూరు గ్రామ ప్రజలు ఐక్యంగా నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమం ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రతి ఏడాది భక్తి భావంతో నిర్వహించే ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తోందన్నారు.
అన్నసమారాధనలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయగా, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.