*ప్రకృతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత*

  పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే27: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ జీవన విధానానికే పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు సహజంగా ఉండే వాతావరణ మార్పులు ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు మండిపోతున్న ఎండలు, భరించలేని వేడి, నీటి కొరత, ఆరోగ్య సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. రోజురోజుకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం వెనుక ప్రధాన కారణం ప్రకృతి సమతుల్యత దెబ్బతినడమే. అడవుల...