తెలుగు సంగీత రంగానికి తీరని లోటు: పలుస శంకర్ గౌడ్
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 12 2026: ప్రముఖ నేపథ్య గాయని జానకి దేవి మృతి పట్ల సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జానకి దేవి గొంతు కోకిల స్వరంలా మధురంగా ఉండేదని, ఆమె ఆలపించిన ప్రతి పాట సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆమె గానంలో నిండిన భావోద్వేగం, మాధుర్యం, సాహిత్యంలోని అర్థవంతమైన సందేశాలు నేటి తరానికే కాకుండా రాబోయే తరాలకు కూడా గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. భారతీయ సంగీత రంగానికి జానకి దేవి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న ఆయన, ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆలపించిన మధుర గీతాలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటాయని అన్నారు. జానకి దేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని పలుస శంకర్ గౌడ్ తెలియజేశారు. ఆమె మరణం తెలుగు సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.