ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి
బిక్కవోలు, సెప్టెంబర్ 2: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు కొవ్వూరి రామారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వంతెన వద్ద ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సొసైటీ వద్ద ఉన్న వైయస్‌ఆర్ విగ్రహానికి...