తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్)జెండా ఆవిష్కరణ.
అద్భుతంగా జెండాపార్టీ ఆవిష్కరణ మహోత్సవం పండుగలా మారిన పరిసరాలు.
ప్రజల గుండె చప్పుడుగా టిఆర్ఎస్ పార్టీ
టిఆర్ఎస్ పార్టీ దేవరకద్ర ఇంచార్జ్ జి.దామోదర్ గౌడ్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20 2026: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తూ ప్రతి గ్రామం,ప్రతి వాడలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్)పార్టీ దేవరకద్ర ఇంచార్జ్ జి.దామోదర్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం నాడు వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం కేంద్రంలో మార్కెట్ యార్డ్ పక్కన, పార్టీ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ మహోత్సవం దేవరకద్ర ఇంచార్జ్ జి.దామోదర్ గౌడ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావడంతో జెండా ఆవిష్కరణ వేదిక జనసంద్రంగా మారింది. పార్టీ అధినేతలు ముఖ్య నేత విప్లవాత్మక నినాదాలు, కార్యకర్తల కోలాహలం మధ్య పార్టీ అధికారిక జెండాను ఆవిష్కరించి, జెండా ఎగురవేసిన అనంతరం కార్యకర్తల హర్షధ్వానాలు, నినాదాల మధ్య ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యకర్తల జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ సందర్భంగా పార్టీ ఇన్చార్జి దామోదర్ మాట్లాడుతూ… తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల హక్కుల రక్షణ కోసం, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం, మరియు రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసమే “తెలంగాణ రక్షణ సేన”పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కేవలం అధికారమే ధ్యేయంగా కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడటమే ప్రతి పేదవాడి హక్కుల కోసం అహర్నిశలూ పోరాడేందుకే ఈ సేన పుట్టిందని అన్నారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని కార్యకర్తలందరూ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ అద్భుతమైన జెండా ఆవిష్కరణ మహోత్సవంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వెంకట రామమూర్తి, మహబూబ్నగర్ ఇన్చార్జ్ ప్రభాకర్, వనపర్తి జిల్లా ఇన్చార్జ్ కరాటే శీను మరియు నాయకులు మహేందర్ రెడ్డి,కొత్తకోట మండల అధ్యక్షులు విజయ్,స్వామి మరియు మహిళాలు, నాయకులు,కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.