ప్రజల మధ్యలోనే కాంగ్రెస్ నాయకత్వం: దానవాయిగూడెంలో మార్మోగిన శుభకార్యాలు.. పాల్గొని ఆశీర్వదించిన చల్లా కృష్ణ!
ఖమ్మం (పాలేరు) / ప్రత్యేక ప్రతినిధి: నాగరాజు రెడ్డి ప్రజల కష్టసుఖాల్లోనూ, శుభకార్యాల్లోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని 59వ డివిజన్ దానవాయిగూడెం గ్రామంలో బుధవారం సందడి వాతావరణం నెలకొంది. గ్రామంలో నిర్వహించిన రెండు వేర్వేరు శుభకార్యాలకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ 'చల్లా కృష్ణ' ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిన్నారి అన్నప్రాసన వేడుకల్లో.. దానవాయిగూడెం గ్రామానికి చెందిన మద్దెల పిచ్చయ్య - సుందరమ్మ గార్ల...