POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 3:59 pm Posted by : POLITICAL POWER

ప్రజల మనిషిగా ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు.. ప్రత్యేక అభినందించిన ‘పొలిటికల్ పవర్’ ప్రతినిధి సత్యప్రసాద్! – ప్రజలతో మమేకమవుతూ.. సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న డీఎస్పీ – ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి

 

 

పిపిఎన్ 9 న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సత్యప్రసాద్ (నవంబర్ 06, 2026):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ప్రజల రక్షనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబును ‘పొలిటికల్ పవర్’ జాతీయ తెలుగు దినపత్రిక ప్రతినిధి సత్యప్రసాద్ వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు శాఖ ద్వారా అందుతున్న సేవలపై ప్రత్యేకంగా చర్చించారు.

ప్రజల ఆదరణే కొలమానం…

  • తక్షణ స్పందన: ఏ సమస్యతో ఎవరు వచ్చినా సానుకూలంగా స్పందించడం, బాధితుల దృష్టికి వచ్చిన కేసులను వెంటనే పరిష్కరించడంలో డీఎస్పీ వెంకన్న బాబు ప్రత్యేక శైలిని కనబరుస్తున్నారు.
  • ప్రజలతో మమేకం: కేవలం కార్యాలకే పరిమితం కాకుండా, ప్రజలతో నిత్యం మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు.
  • నిజాయితీకి నిలువెత్తు రూపం: ప్రజాదరణే ప్రధాన ధ్యేయంగా, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటూ ఇల్లందు డివిజన్‌లో శాంతిభద్రతలను అదుపులో ఉంచుతున్న తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రజల మధ్యన ఉంటూ, వారి సమస్యలకు సత్వర న్యాయం చేస్తున్న ఇలాంటి సమర్థవంతమైన అధికారుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని ప్రతినిధి సత్యప్రసాద్ ఈ సందర్భంగా కొనియాడారు. డీఎస్పీ వెంకన్న బాబు మరింత ముందుకు సాగుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.