POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 9:40 pm Posted by : POLITICAL POWER

ప్రజావాణిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వినతి

పోలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 తెలుగు న్యూస్ జూన్ 8 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ తమకు నివాసం ఉండటానికి స్వంత ఇల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గాంధీనగర్‌కు చెందిన చేరిపల్లి భార్గవి సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా బాధితురాలు భార్గవి (భర్త గోవర్ధన్) మాట్లాడుతూ… తాము గత కొంతకాలంగా గాంధీనగర్ పరిధిలో అద్దె ఇంట్లో నివసిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరకొండ మండలం గాని, నల్గొండ జిల్లాలో గాని తమకు ఎలాంటి స్వంత ఇల్లు లేదని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ​తమ నిరుపేద పరిస్థితిని పరిశీలించి, మానవతా దృక్పథంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక ఇల్లు మంజూరు చేయాలని ఆమె జిల్లా ఉన్నతాధికారులను వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు స్వయంగా కలిసి దరఖాస్తును అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు.