POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 6:41 pm Posted by : POLITICAL POWER

ప్రజావాణి బాధితుడు సిసింద్రీ రెడ్డికి 4.25 లక్షల ఎల్ఓసి అందజేసిన

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

బాధితుడికి కొండంత అండ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 20 2026: సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరువు నియోజకవర్గం బీరంగూడ నివాసి అయిన సిసింద్రీ రెడ్డి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ (మార్పిడి) చికిత్స పొందాలని సీఎం ప్రజావాణిలో సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి విన్నవించుకోగా బాధితునికి 4,25,000 (నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల) విలువైన ఎల్ఓసీ (LOC) కాపీని సిసింద్రీ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. సమయానికి ఎల్ఓసీ కాపీ అందడంతో తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తూ చిన్నారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఏఐపిసి అధ్యక్షులు నాగార్జున, గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు చరణ్ రాజ్, సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండారెడ్డి, సహదేవుడు, ద్వార పోగు విజయబాబు, నందిమల్ల రాము, బాల్ చందర్, సుదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.