POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:18 am Posted by : POLITICAL POWER

ప్రజా సేవే మా లక్ష్యం ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు సుమతీ రత్నం

పొలిటికల్ పవర్: దాచేపల్లి నగర పంచాయతీలోని ఇరికేపల్లి గ్రామం నందు ది మదర్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షురాలు సుమతిరత్నం మీడియాతో మాట్లాడుతూ ఉచిత కంటి & ఎముకల వైద్య శిబిరంప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ నెల మొదటి శుక్రవారం, అనగా 7వ తేదీన, శంకర్ కంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో, ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ, ఇరికేపల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది.అదేవిధంగా గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డా. పి. రాజా, ఎం.ఎస్. (ఆర్థో) గారి ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్లు, వెన్నెముక మరియు ఇతర ఆర్థోపెడిక్ సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయబడును.శిబిరం నిర్వహించే స్థలం:శ్రీ నాగెండ్ల రత్నంగారి కాంప్లెక్స్, ఇరికేపల్లిశిబిరానికి విచ్చేసే వారుతప్పనిసరిగాతీసుకురావలసినవి:ఆధార్ కార్డు మొబైల్ ఫోన్ నంబర్ తీసుకురావలికంటి సమస్యలు, ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా అధ్యక్షురాలు నాగెండ్ల సుమతి రత్నం తెలిపారు.