POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:59 am Posted by : POLITICAL POWER

ప్రతి ఒక్కరూ తమ మొదటి వేతనం మొదటి సంపాదన భక్తిశ్రద్ధలతో ఆలయాలకు సమర్పించి దైవానుగ్రహాన్ని పొందాలి

–  శ్రీ హరిహారపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి  విరాళంగా మొదటి వేతనం అందించిన నిహారిక విశ్వనాథం,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ  న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు06. 2026.
ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరినప్పుడు తమ మొదటి వేతనం మొదటి సంపాదన భక్తిశ్రద్ధలతో ఆలయాలకు సమర్పించి దైవానుగ్రహాన్ని పొందాలినిహారిక తండ్రి విశ్వనాథం అన్నారు.బుధవారంకొత్తకోట పట్టణం లోని శ్రీ హరిహారపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి కొత్తకోట  పట్టణానికి చెందిన విశ్వనాథం మాధవి గంగాధర్ కూతురువిశ్వనాథంకూతురు నిహారిక ఇటీవల ఉద్యోగం లో చేరగా తనకు వచ్చిన మొదటి వేతనం ₹.51,000/-  ( యాభై ఒక్క వెయిల రూపాయలను ) ఆలయకమిటీసభ్యులకుఅందజేశారు.ఈసందర్భంగా వారుమాట్లాడుతూమనజీవితంలోమొదటివేతనంఅనేదిఎంతోవిలువైనది.ఆమొదటిసంపాదనదైవకార్యాలకువిరాళంగాసమర్పించడం మన భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప ఆచారం.ఇలా సమర్పించడం వల్లదేవునిపట్లకృతజ్ఞతనువ్యక్తపరుస్తాం.మనకుఉద్యోగం,ఆరోగ్యం,అవకాశాలుకల్పించినభగవంతునిఆశీస్సులనుస్మరించుకుంటూ, ఆలయ అభివృద్ధికి తనవంతుసహకారం అందిస్తున్నానని ఇది కేవలం తన మొదటి వేతనం కాదని 22 సంవత్సరాల శ్రమకు ఫలితంఅనిఇట్టివిరాళాన్నినిత్యపూజలు,అన్నదానం,ధార్మికకార్యక్రమాలు,దేవాలయనిర్వహణవంటిసేవలకు ఉపయోగించాలని  మన చిన్న సహాయం కూడా ఎంతో మందికి మేలు చేస్తుందనిఅందుకే,ప్రతిఒక్కరూ తమ మొదటి వేతనం లేదా మొదటి సంపాదన భక్తిశ్రద్ధలతోఆలయానికిసమర్పించి,దైవానుగ్రహాన్నిపొందాలనిమనస్ఫూర్తిగాకోరుకుంటున్నామని వారు అన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవసమితి అధ్యక్షులు ధూపం నాగరాజు , పొగాకు అనీల్ కుమార్ , బలిజ లింగేశ్వర్ , భీమ కిషోర్ , వేముల సుధాకర్ రెడ్డి , లక్ష్మీనారాయణ యాదవ్ తదితరులు నిహారికను అభినందించి శాలువాతో సన్మానించారు.