POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 5:04 pm Posted by : POLITICAL POWER

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ కీమ్యా నాయక్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 26.2026.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ కీమ్యా నాయక్ అన్నారు.వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో అదనపు కలెక్టర్ మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం నర్సరీ పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటుగా పెట్టుకోవాలని, అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఆయా డిపార్ట్మెంట్లకు ఇచ్చిన లక్ష్యం మేరకుమొక్కలు నాటాలని ప్రస్తుతము వర్షాలు కురుస్తున్నందున ఈ వాతావరణపరిస్థితులనుసద్వినియోగంచేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో యాదయ్య జిల్లా పంచాయతీ గారి రఘునాథ్ రెడ్డి ఎంపీడీవో స్థానిక సర్పంచ్ పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.