POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:44 am Posted by : POLITICAL POWER

ప్రతి ఓటు ఎంతో ముఖ్యం..  BLA-2లదే ప్రధాన భూమిక

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు

SIR ప్రక్రియపై అప్రమత్తంగా పనిచేయాలి

నిర్లక్ష్యానికి తావివ్వొద్దు..

 చిన్న తప్పిదాలు కూడా సరిచేయాలి

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: SIR కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని RG గార్డెన్స్‌లో గురువారం BLA-2ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మల్లేష్ యాదవ్, శత్రురావు శిక్షకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఓటు ఎంతో విలువైనదని, SIR ప్రక్రియలో BLA-2ల బాధ్యత కీలకమన్నారు. బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు సక్రమంగా ఇందులో చూసి సరి చేయాలన్నారు. ఓటరు నమోదు, వివరాల సవరణ సమయంలో చిన్నపాటి పొరపాట్లకు కూడా అవకాశం ఇవ్వకూడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పేరు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సకాలంలో సరిచేయించాలని చెప్పారు. వివరాల పరిశీలనకు సంబంధించి కొంతమంది ఓటర్లకు నోటీసులు అందుతున్న నేపథ్యంలో, వాటిని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పత్రాలు, వివరాలను వెంటనే సమర్పించేలా అవగాహన కల్పించాలని BLA-2లకు సూచించారు.

పనిచేయని చోట కొత్త BLA-2లు

ప్రతి బూత్‌లో BLA-2లు క్రియాశీలకంగా పనిచేయాలనీ, సక్రమంగా పనిచేయని BLA-2ల వివరాలను సేకరించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్తవారిని నియమించుకునేలా చర్యలు ఉంటాయన్నారు. SIR ప్రక్రియలో ఓటర్ల వివరాల పరిశీలన, తప్పుల సవరణ, అర్హులైన ఓటర్ల నమోదుకు సంబంధించిన అంశాలపై శిక్షణలో అవగాహన కల్పించారు. ఎన్నికల జాబితాలో అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షించబడేలా, ప్రతి బూత్‌లో BLA-2లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షకులు దృశ్య మాధ్యమం ద్వారా SIR కార్యక్రమానికి సంబంధించిన అంశాలను BLA -2 వివరంగా వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కదిరె రాములు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.