POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 6:52 pm Posted by : POLITICAL POWER

ప్రతి కేసులో వేగవంతమైన నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలి

– సీసీటీఎన్ఎస్ ద్వారా కేసుల రికార్డుల పరిశీలించిన ఎస్పీ, నిర్ణీత సమయములో కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ అప్లోడ్ చేయాలి,

– గంజాయి, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి, సైబర్ బాధితులకు తక్షణ స్పందన, డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.ఆగస్టు 08.2026.

శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పోలీసు ప్రధాన ధ్యేయం కావాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా మరింత ఉత్సాహంగా, నిబద్ధతతో పనిచేయాలఅని జిల్లాఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ అన్నారు. శుక్రవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో జిల్లాలోని పోలీసు అధికారులు డిఎస్పీలు, సీఐలు,అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ నెలవారి నేరసమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులు తెలుసుకొని చాలా కాలము నుండి పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని, పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎఫ్ ఎస్ యల్ రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్ త్వరగా తెప్పించి కేసులను చెడించాలని ఎస్పీ సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షిస్తూ, ప్రతి కేసులోనూ వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (షొప్) ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. గ్రేవ్, నాన్-గ్రేవ్, పోక్సో, మహిళలపై నేరాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ తదితర కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, సైంటిఫిక్ ఎవిడెన్స్, సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగించడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.పోలీస్ స్టేషన్లకువచ్చేప్రతిఫిర్యాదుదారునితోమర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని సత్వర పరిష్కారం అందించాలని తెలిపారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరగాలంటే స్పందనలో మానవీయ దృక్పథం, సేవల్లో వేగం, దర్యాప్తులోనిబద్ధతఉండాలనిపేర్కొన్నారు.జిల్లాలోగంజాయి,మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించి నేరస్థులపై కఠిన చర్యలుతీసుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో సైబర్ నేరాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు సూచించాలని తెలిపారు.నేరాల నివారణలో భాగంగా ప్రతి పోలీసు అధికారిక్రమంతప్పకుండాగ్రామాలనుసందర్శించాలని, ప్రజలతో సమన్వయంపెంచుకోవాలనిసూచించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారం వేగంగా పోలీసులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, , నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి, బైండోవర్ చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైతే కొత్త రౌడీషీట్లు కూడా తెరవాలని సూచించారు.నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామం, పట్టణంలోని ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ధాబాలు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకుకృషిచేయాలని ఎస్‌హెచ్‌వోలకుఆదేశించారు.ఇప్పటికేఏర్పాటుచేసినసీసీకెమెరాలుసక్రమంగాపనిచేస్తున్నాయా లేదా తరచూ తనిఖీ చేసి, సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనేమరమ్మతులుచేయించాలనిసూచించారు.డయల్-100కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణసహాయంఅందించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు,నాకాబందీలు,నైట్,పెట్రోలింగ్‌నుమరింతసమర్థవంతంగానిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకుహెల్మెట్,సీట్‌బెల్ట్,వినియోగంపై విస్తృతఅవగాహనకల్పించాలనిఆమెసూచించారు.ఈ నేర సమీక్ష సమావేశంలో వనపర్తి డీఎస్పీ. గిరిబాబు, వనపర్తి సీఐ. సుగంధ రత్నం, కొత్తకోట సీఐ. రాంబాబు, ఆత్మకూరు సీఐ. శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ. నరేష్, డిసిఆర్భి ఎస్సై. తిరుపతి రెడ్డి, వనపర్తి జిల్లాలోని ఎస్సైలు, డిసిఆర్బి, ఐటి కోర్, విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.