POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 6:41 pm Posted by : POLITICAL POWER

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలి..

గుడిసెలు లేని వనపర్తి జిల్లా లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

 మొదటి విడతలో ఇంటి నిర్మాణం ప్రారంభించుకొని వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఒకేసారి బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయి ఆర్ధిక స్టొమత లేక కట్టుకోలేని పేదలకు కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రతి పేదవానికి ఒక పక్కా ఇల్లు ఉండాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని 100% విజయవంతం చేసేందుకు వనపర్తి జిల్లాలో గుడిసెల్లో నివసించే ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే కాకుండా.. ఆర్ధిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు ప్రభుత్వమే ముందుకు వచ్చి లబ్ధిదారునికి కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వివరించారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులతో శుక్రవారం వనపర్తి ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఆత్నగౌరవం కొరకు ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలి అనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందని దానితోపాటు గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అదేవిధంగా గోడలు ఉండి పైకప్పు రేకులు పెంకులతో ఉన్న వారికి పైకప్పు వేసుకునే విధంగా రెండో విడతలో నియోజకవర్గానికి మరో 2000 ఇళ్ళ చొప్పున మంజూరు చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంలో వనపర్తి నియోజకవర్గం లో మొదటి విడత మంజూరు చేసిన ఇళ్లలో ఆర్ధిక స్థోమత లేక దాదాపు 300 మంది మంజూరు ఉత్తర్వులు పోంది ఇల్లు నిర్మించుకోలేదని అలాంటి వారికి లబ్ధిదారులు ఒప్పుకుంటే కాంట్రాక్టర్ ద్వారా నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు కాంట్రాక్టర్ బ్యాంకరు ముగ్గురు పేరున ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పని జరిగే విధంగా విడుతలవారీగా ముందుగా డబ్బులు లబ్ధిదారుని ఖాతాలో జమ చేసి అనంతరం కాంట్రాక్టర్ కు బదిలీ చేయడం జరుగుతుంది. 418 చదరపు కడుపులో 9 పిల్లర్లు రెండు అడుగుల బేస్మెంట్ వరకు వేసి, సిమెంట్ ఇటుకలతో ఒక హాల్, బెడ్ రూమ్, కిచెన్, లాటరిన్ బాత్రూమ్ తో కూడిన చక్కని ఇందిరమ్మ ఇంటిని కాంట్రాక్టర్ ద్వారా నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు ఒప్పుకొని స్వచ్ఛందంగా కాంట్రాక్టర్ తో ఒప్పందం చేసుకుంటే మూడు నెలల్లోనే ఇల్లు పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తే కొందరు అప్పులు తీసుకువచ్చి అవసరం లేకున్నా ఎత్తయిన బేస్మెంట్లు నిర్మించుకొని ఇల్లు పూర్తి అయ్యేవరకు అప్పుల పాలవుతున్నారని దానివల్ల వారు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. అవసరం బట్టి నాన్యమైన ఇళ్ళు కట్టుకోవాలి తప్ప అనవసర ఆర్భాటాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దని లబ్ధిదారులను సూచించారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు త్వరలో ఒకేసారి మొత్తం పేమెంట్ చేసే విధంగా ప్రభుత్వము ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసిందని తెలియజేశారు. దేశంలో ఎల్ నీనో ప్రభావం వచ్చే జూలై వరకు ఉంటుందని అందువల్ల ప్రజలు ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని నల్లాలు ఓపెన్ చేసి వదిలేయడం సరికాదని నీటి విలువను గుర్తించాలని చెప్పారు. విద్యుత్ వినియోగం సైతం అవసరం మేరకు మాత్రమే వాడాలని ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా విద్యుత్తు నీరు దొరికే అవకాశం లేదని తెలియజేశారు. వనపర్తి నియోజకవర్గం లో మొదటి విడతలో 3500 ఇళ్లు మంజూరు చేయగా అందులో 3164 ఇళ్లకు మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగిందని, రెండో విడతలో 258 వెరసి 3422 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు దారి చేయడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు 1040 ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించుకొని మిగిలినవి వివిధ నిర్మాణ స్థాయిలో ఉన్నాయన్నారు. వనపర్తి జిల్లాలో దాదాపు 443 మంది లబ్ధిదారులు మంజూరు పత్రాలు తీసుకొని కూడా వివిధ కారణాలవల్ల ఇంటి నిర్మాణం ప్రారంభించలేదని అలాంటి వారికి కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఈ ప్రత్యేక పథకము ఉపయోగపడుతుందన్నారు. అయినప్పటికీ బలవంతం ఏమి లేదని లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఒప్పుకుంటే కాంట్రాక్టర్ ద్వారా నిర్మించి ఇస్తామని లేదంటే లబ్ధిదారులు సొంతంగా కట్టుకోవచ్చని తెలియజేశారు. ఈ రెండు కాకుండా ఇల్లు కట్టుకోకుంటే మాత్రం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు రద్దు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు ఎలా నిర్మించి ఇస్తారో నాణ్యత ప్రమాణాలను వీడియో ద్వారా చూపించారు. ఈ సమావేశంలో పిడి హౌసింగ్ విటోబా వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సర్పంచులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.