– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 18. 2026.
దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.శుక్రవారం కొత్తకోట పట్టణంలోని 3వ వార్డులో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి, పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడడం, దోమల నివారణ చర్యలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, ప్రతి ఇంటిని సందర్శించి దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నీరు నిల్వ ఉండే పాత్రలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జ్వరం లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని, పారిశుధ్యంపై నిరంతరం పర్యవేక్షణకొనసాగించాలని సూచించారు.ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.పురపాలికలో డ్రైనేజీలను సైతం నిత్యం సక్రమంగా శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎక్కడ డ్రైనేజీలు బ్లాక్ అవ్వకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శిథిలావస్థకుచేరినభవనాలవిషయంలోయజమానులతో మాట్లాడి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, కొత్తకోట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సునీత పల్లవి, వైద్య శాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


