Date of Publish : 18 September 2026, 7:19 pmPosted by : POLITICAL POWER
ప్రత్యేక అవసరాల పిల్లలకు సమగ్ర విద్య..
రైతులకు మెరుగైన మార్కెట్ సేవలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026:పెబ్బేరులో నూతన భవిత కేంద్రం, మార్కెట్ యార్డు అదనపు కార్యాలయ గదులు ప్రారంభం విద్య, వ్యవసాయ రంగాల మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అవసరమైన సహాయ సేవలు అందించడం రైతులకు మార్కెట్ యార్డుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని నూతన నిర్మాణాలను ప్రారంభించారు. పెబ్బేరు పాఠశాలలో నిర్మించిన నూతన భవిత కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్య, శిక్షణ, అవసరమైన సహాయక సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. స్పీచ్, ఫిజియోథెరపీ, కమ్యూనికేషన్, స్వయం ఆధారిత నైపుణ్యాలతో పాటు పాఠశాల విద్యకు అనుసంధానం చేసే విధంగా అవసరమైన సహకారం అందించేందుకు భవిత కేంద్రం దోహదపడుతుంది. ప్రతి చిన్నారికి సమాన విద్యా అవకాశాలు కల్పించి, వారి ప్రతిభను వెలికితీయడమే సమగ్ర విద్య లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ యార్డు పరిపాలనా వ్యవస్థ కోసం నిర్మించిన అదనపు కార్యాలయ గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ.44 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణాలతో మార్కెట్ యార్డు పరిపాలనా కార్యకలాపాలకు అదనపు వసతులు అందుబాటులోకి వచ్చాయి. అధికారులు, సిబ్బంది విధులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించడంతో పాటు రైతులు, వ్యాపారులకు అవసరమైన సేవలను మెరుగ్గా అందించేందుకు ఈ భవనం ఉపయోగపడనుంది. రైతులకు సంబంధించిన మార్కెట్ మౌలిక వసతులను బలోపేతం చేసి, వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా, అధ్యక్షులు కోదండరామిరెడ్డి, కౌన్సిలర్లు నాయకులు రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, యుగేందర్ రెడ్డి, పేపర్ల రాంరెడ్డి, రాములు యాదవ్, మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.