POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:37 pm Posted by : POLITICAL POWER

ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మండల అధ్యక్షులు బానోత్ వీరు నాయక్ ఉపాధ్యక్షులు పొతురాజు మురళీకృష్ణ. మరియు ఆటో డ్రైవర్లు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కొత్తగూడెం బస్టాండ్ ఆటో అడ్డాలో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని మండల అధ్యక్షుడు వీరన్న నాయక్, ఉపాధ్యక్షుడు పోతురాజు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బానోత్ వీరు నాయక్ మాట్లాడుతూ… ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలుపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రభావంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి తగ్గి, అనేక మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన ఘటనలు బాధాకరమన్నారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది ఇంకా అమలు కాలేదని పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు తమ వంతు సహాయం అందిస్తూ ఒక కుటుంబంలా అండగా నిలుస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని ఐక్యతకు ప్రతీకగా నిర్వహించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ సలహాదారు ఆనందరావు, జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బసవచారి, జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు బానోతు భాగ్య నాయక్, సహాయ సలహాదారు బానోతు రవి నాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.