పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: పెద్దమందడి మండలం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో గ్రామ పల్లె ప్రగతి పార్కులో గురువారం మొక్కల నాటకం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, గ్రామ కార్యదర్శి వెంకటేష్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మొక్కల పెంపకంతో పచ్చదనం పెంపొందించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామ ప్రజలు సంకల్పించారు.
