పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 06 2026: పెద్దమందడి మండలం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దమందడి గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మ రవి, ఉప సర్పంచ్ ఉషన్న, మాజీ జెడ్పీటీసీ, పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గంగమ్మ రవి మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చెట్లు మనకు ప్రాణవాయువును అందించి జీవావరణ సమతుల్యతను కాపాడతాయని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అడవుల సంరక్షణ ద్వారా వర్షపాతం పెరిగి ప్రకృతి సమతుల్యత నెలకొంటుందని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు పచ్చదనం పెంపొందించడం అవసరమన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. గ్రామాలు పచ్చదనంతో కళకళలాడితే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ కార్మికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
