POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 2:52 pm Posted by : POLITICAL POWER

ప్రభుత్వాల నిర్లక్ష్యం.. హోంగార్డుల జీవితాలతో చెలగాటం! 5 లక్షల మంది హోంగార్డుల భవిష్యత్తుపై ‘కేంద్ర, రాష్ట్రాల’ నానాటికీ తీసిపోతున్న తీరు! ఉద్యోగ భద్రత లేదు.. సొంత రాష్ట్రాలకూ పంపరు.. ఇదా ప్రజాక్షేమం?

హైదరాబాద్ / అమరావతి: *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
(9160591108
9848515889)

దేశరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సమానంగా 24 గంటల పాటు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న హోంగార్డుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. 1946లో స్వచ్ఛంద దళంగా ప్రారంభమై, నేడు దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విస్తరించిన హోంగార్డు వ్యవస్థను నేటికీ అలసత్వంతో చూడటం దారుణమని హోంగార్డు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
1. వాలంటీర్ చట్టాన్ని రద్దు చేయాలి – ఉద్యోగ హోదా కల్పించాలి!
పోలీసులతో సమానంగా నైట్ బీట్‌లు, ట్రాఫిక్ నియంత్రణ, విఐపి బందోబస్తులు, వరదలు-అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణాలకు తెగించి విధి నిర్వహణ చేస్తున్న హోంగార్డులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం శోచనీయం.
> కేంద్ర హోంశాఖకు సవాల్:
> “ఇంకా ఎంతకాలం ‘స్వచ్ఛంద వ్యవస్థ’ అనే పాత చట్టాల వెనుక దాక్కుంటారు? దేశంలో హోంగార్డు వ్యవస్థ పేరిట సాగుతున్న శ్రమదోపిడీకి ముగింపు పలకాలి. హోంగార్డ్ వాలంటరీ చట్టాన్ని వెంటనే రద్దు చేసి, హోంగార్డులకు శాశ్వత ఉద్యోగ హోదాతో పాటు గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగావకాశాలు కల్పించాలి!” అని హోంగార్డు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
>
2. విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా.. ‘స్థానికత’ చిక్కుముడులేంటి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏళ్లు దాటుతున్నా, ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగా హోంగార్డుల బదిలీలు చేపట్టకపోవడం రెండు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం.
* అటు ఆంధ్రా.. ఇటు తెలంగాణ: తెలంగాణలో సుమారు 200 మంది ఆంధ్రా స్థానికత కలిగిన హోంగార్డులు, ఆంధ్రప్రదేశ్‌లో 200 మంది తెలంగాణ స్థానికత కలిగిన హోంగార్డులు తీవ్ర తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

* మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ అసాధ్యమా?: రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందం (Mutual Transfer) చేసుకుంటే పరిష్కారమయ్యే చిన్న సమస్యను కూడా సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

* కుటుంబాల విచ్ఛిన్నం: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోలేక, పిల్లల భవిష్యత్తు స్థానికత (Locality) దెబ్బతింటుందనే ఆందోళనతో హోంగార్డు కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. 13 ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, ప్రజా ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా హామీలే తప్ప ఆచరణ శూన్యమైంది!
3. కొత్త బిల్లుపై హోంగార్డుల ఉత్కంఠ – హామీలు నెరవేరేనా?
ఇటీవల అక్టోబర్ 23 మరియు అక్టోబర్ 26న జరిగిన ఉన్నత స్థాయి వర్చువల్, హోం మంత్రిత్వ శాఖ సమావేశాల నేపథ్యంలో హోంగార్డ్ జవాన్లలో ఆశలు చిగురిస్తున్నాయి.
* ప్రధాన డిమాండ్లు:
* పాత చట్ట సవరణ మరియు కొత్త బిల్లు ఆమోదం.
* సేవా భద్రత, సరైన మానదేయం (Honorarium).
* PF, ESI మరియు మెడికల్ సదుపాయాల అమలు.
ఆధికారిక నిర్ణయం వచ్చే వరకు హోంగార్డులు అప్రమత్తంగా ఉండాలని, తమ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
‘పొలిటికల్ పవర్’ డిమాండ్:
> “దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది హోంగార్డుల కుటుంబాల భవిష్యత్తు ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే హోంగార్డుల బిల్లును ఆమోదించాలి! అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తక్షణమే స్పందించి పరస్పర బదిలీల (Mutual Transfers) ఫైలుపై సంతకాలు చేసి హోంగార్డుల స్థానికత సమస్యను పరిష్కరించాలి!”
>