POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 8:29 pm Posted by : POLITICAL POWER

ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన ఇళ్లను 22A లో ఎందుకు చేర్చుతున్నారు…

-22A చట్టాన్ని వెంటనే తొలగించాలి.. ప్రజలకు సరైన న్యాయం చేయాలి..

-రెయిన్బో విస్టా.. బండి మధుసూదన్ రెడ్డి….

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్ పల్లి ప్రతినిధి గత కొంతకాలంగా ప్రభుత్వం చేపట్టిన 22 A తో తీవ్రమైన మనోవేదన తో గురవుతున్నారు ప్రజలు ఈ సమస్య పై కుకట్ పల్లి ప్రాంతంలో Sy.No.81, 101/1, 101/2, 102, 108,109 to111,112,289/1 ప్రభుత్వ అనుమతులతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించిన బహుళ అంతస్తుల సముదాయాలయిన రెయిన్బో విష్టాస్ పేస్ 1లో450 గృహాలు, రెయిన్బో విష్టాస్ రాక్ గార్డెన్ లో 2572 గృహాలు, మెరినా స్కై లో 1280 గృహాల సముదాయాలను 22 ఏ లో చేర్చారు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో గుత్తేదారు నిర్మాణాలు చేయడము ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నమ్మకంతో సంపాదించుకున్న కొంత నగదు కట్టుకుని బ్యాంకు రుణాలు తీసుకొని కొనుక్కున్న మా సముదాయాలను అర్దంతరంగా 22 A లో చేర్చారు. అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి మరల ఇలా చేయడం సబబు కాదు . దీనిపై కుకట్ పల్లి ప్రాంత వాసులు 22A తో ఆందోళన చెంది భయాందోళన కు గురై కాలనీ వాసులు మరియు సంఘాలు కుకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు కి విన్నవించిగా ఆయన కుకట్ పల్లి లో ముఖ్యమంత్రి రెవిన్యు మంత్రి పాల్గొన్న సభావేదిక లో వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ఈ అంశం పై స్పందించిన మొదటి శాసనసభ్యులు కృష్ణారావు ఆ సభలో ఆయన అడిగిన కొద్ది రోజులకు 22 A లో అధికారుల తొందరపాటు వలన తప్పులు జరిగినాయి దీనిపై మన్నించండి అని సాక్ష్యాత్తు రెవెన్యూ మంత్రి కోరడం హాస్య స్పదమైన విషయం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. సామాన్య మానవుడికి ఈ 22A ని ఎందుకు ప్రజల మీద ఎవరు రుద్దారు మల్లి తప్పైందని తొలగించమన్నది ఎవరు ఇంత నిర్లక్ష్యమైన పరిపాలన. నగర అభివృద్ధిని అటకెక్కించి ప్రజలను ఇబ్బందుల కు గురిచేయడం ప్రజాపాలనా గతం లో పాలించిన ఏ ముఖ్యమంత్రి ఇంత నిర్లక్ష్య పాలన అందించలేదు. నగరం లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాపిక్ ప్రత్యామ్నాయం లేదు మూడు సంవత్సరాల లో నగరం లో ఒక్క కొత్త అభివృద్ది కి నోచుకోలేదు. ముఖ్యమంత్రి మో ప్రతిపక్షాలు క్షుద్రపూజాలు చేస్తున్నారు అని ఎదురు దాడుల తో ప్రభుత్వ అసమర్థత ను కప్పిపుచ్చుకునే దోరణి తో ఉన్నారు దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమిలేదు. ప్రస్తుత పరిస్థితుల లో నగరం లో సామన్య మానవుడు ఇళ్లు కొనలేని పరిస్థుల్లో ఎప్పుడో కొన్న ఇంటి మీద ఇలా కొత్త చట్టాలు తెచ్చి ఆందోళన కు గురిచేయడం చేతగాని పరిపాలన నిదర్శనంగా ప్రజలు బావిస్తున్నారు అనేది గమనించి వారికున్న రెండేళ్ల కాలంలో అయిన నగర అభివృద్ది పై దృష్టి సారించి నగరవాసలు జీవనం సాఫీగా సాగేలా చూడాలని కొరుకుంటున్నాము అని తెలియజేశారు బండి మధుసూదన్ రెడ్డి రెయిన్బో విష్టాస్ కాలనీవాసులు…