*ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రమాదకర ప్రయాణం!* ◦ రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రహదారి ◦ ఆరు నెలల్లోనే 10కి పైగా ప్రమాదాలు ◦ రోడ్డు దాటేందుకు విద్యార్థులు, స్థానికులు, రోగుల అవస్థలు ◦ అగ్రికల్చర్ కాలేజీ నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్
*అశ్వారావుపేట, నవంబర్ 06 ( పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ):* ఖమ్మం–రాజమండ్రి జాతీయ రహదారిపై అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీ నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు ఉన్న రహదారి ప్రమాదకరంగా మారుతోంది. ఈ మార్గంలో వాహనాల వేగానికి అడ్డుకట్ట లేకపోవడం, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు నిత్యం భయాందోళనల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం గత ఆరు నెలల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో 10కి పైగా రోడ్డు...