POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 1:07 pm Posted by : POLITICAL POWER

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం పెబ్బేరు మండలంలోని యాపర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న హెడ్ మాస్టర్ ఉసేన్ ను ఆయన శాలువ జ్ఞాపికలతో సత్కరించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి విషయానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా దాతల సహకారంతో వనరులను,వసతులను సమకూర్చుకోవాలని అన్నారు.గ్రామస్తుల సహకారం తో విద్యార్థుల సంఖ్యను పెంచడంలోనూ,తరగతి గదులు,ఉపాధ్యాయులను సమకూర్చడంలోనూ,బడితోటను పెంచడంలోనూ హెచ్ ఎం.ఉసేన్ కృషిని శంకర్ గౌడ్ అభినందించారు. ఈనాటి కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్,మైనొద్దిన్, విష్ణు,కవిత తదితరులు పాల్గొన్నారు.