POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 6:06 pm Posted by : POLITICAL POWER

ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ 

నూతనంగా చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 17 2026: ప్రభుత్వం అందిస్తున్న ఉన్నతమైన విద్య, మెరుగైన సదుపాయాల వల్ల ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ 3వ వార్డులో గల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన చిన్నారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ రెహనా బేగం కమల్ పాషా, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి బొంతు సుమలత వేణు సామూహిక అక్షరాభ్యాసం మరియు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్‌, రెండు జతల యూనిఫాంలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల సమన్వయంతో స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగళ్ల నాగేశ్వరరావు, బెజవాడ రాంబాబు, మల్లెల్లి అనిల్, యువ సేవా సమితి రాజు, రాము, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నూతన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.