POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 6:29 pm Posted by : POLITICAL POWER

ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణం అభివృద్ధికి సర్పంచ్ సహకారం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్, వనపర్తి జిల్లా బ్యూరో | జూన్ 14, 2026: పెద్దమందడి మండలం వెల్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాల ప్రారంభానికి ముందుగా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ డి. అశోక్ ఆధ్వర్యంలో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ కోర్టులను సిద్ధం చేయడంతో విద్యార్థులకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తున్న ఈ చర్యను ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు, ఉపాధ్యాయ బృందం అభినందిస్తూ సర్పంచ్ డి. అశోక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.