ప్రభుత్వ భూములను కాజేసిన వారిపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి హెచ్చరిక
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ప్రతినిధి జూన్ 08 2026: హైదరాబాద్‌లో తెలంగాణ హౌసింగ్ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాము నాయక్ గతంలో తెలంగాణ హౌసింగ్ బోర్డులో ల్యాండ్...