ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేని పోరాటం కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వరుస విజయాలు రెవెన్యూ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు: మంత్రి పొంగులేటి

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ప్రభుత్వ భూముల పరిరక్షణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాజీలేని వైఖరితో ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న భూ...