POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 2:15 pm Posted by : POLITICAL POWER

ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 27 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన నటలీ లక్ష్మమ్మ పది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మమ్మ భర్త నటలీ కృష్ణయ్యను కలిసి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెబుతూ, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కష్టకాలంలో కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.