POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 10:52 am Posted by : POLITICAL POWER

ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలా.

గుండు కొట్టించుకుంటే మతి పోతుందా.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన బాసేన ఇది

నారపాటి రమేష్ ఏదులాపురం మున్సిపాలిటీ నాయకుడు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిది: ఏదులాపురం జూన్ 19 న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ఏదులాపురం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారపాటి రమేష్ డిమాండు చేశారు. ఇటీవల తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంశం పై ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది.గురుకులాల టెండర్లలో ₹2,000 కోట్ల నుండి ₹3,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆధారాలతో ప్రశ్నించిన మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేధావి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏదులాపురం మున్సిపాలిటీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వెంటనే మాజీ ఐపీఎస్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యక్తిగత రూపహేళన మాటలను కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రూపం అనేది భగవంతుడు ఇచ్చినది ఆ రూపాన్ని హేళన చేసి మాట్లాడడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కి సిగ్గుగా అనిపించట్లేదా అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సేవలు ఇప్పటికీ ఎంతోమంది పేద విద్యార్థులు ఆయనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అన్నారు. అలాంటి మాజీ ఐపిఎస్ అధికారిపై సీఎం రేవంత్ రెడ్డి రూప హేళన అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ తెలంగాణ దళిత సామాజిక వర్గాన్ని పై చేసినవిగా నారపాటి రమేష్ అన్నారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులను ఎవరెస్టు శిఖరాలకు ఎక్కించిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి దక్కుతుందని గతంలో ఆయన గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలు ఎలా ఉన్నాయో ఇప్పుడు గురుకుల పాఠశాలల పరిస్థితి ఏంటో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు ప్రపంచ దేశాలలో గురుకుల పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కె దక్కుతుందని నారపాటి రమేష్ అన్నారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డల నోళ్లు కొట్టి టెండర్లలో వేల కోట్ల అవినీతికి పాల్పడడమే కాకుండా, ఆ అవినీతిని ప్రశ్నించినందుకు వ్యక్తిత్వ హననం చేస్తూ,రూపూను అవహేళన చేస్తారా ఇది కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై జరిగిన దాడి కాదు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై జరిగినది దాడి గా ఏదులాపురం మున్సిపాలిటీ నాయకులు నారపాటి రమేష్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ శ్రేణుల డిమాండ్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యక్తిగత, అహంకారపూరిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని నారపాటి రమేష్ డిమాండ్ చేశారు