ప్రాణాపాయ స్థితిలో తల్లీబిడ్డ.. వైద్యుల సమయస్ఫూర్తితో ఇద్దరికీ పునర్జన్మ!
క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయవంతంగా శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ మౌనికకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందనలు అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్సీ ఇన్చార్జ్, మేడపురెడ్డి నాగార్జున:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యం, సమయస్ఫూర్తితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లీబిడ్డను కాపాడారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ఇద్దరి ప్రాణాలను నిలబెట్టారు. అశ్వారావుపేట మండలం గుంటిమడుగు గ్రామానికి చెందిన ఆశీ సమ్మక్క ప్రసవం కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం...