POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 9:32 pm Posted by : POLITICAL POWER

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దందాపై చర్యలు తీసుకోవాలి – టి ఎన్ ఎస్ ఎఫ్ కడప           

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ జూన్ 08 2026: కడప జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఐఐటి ,నీట్, జేఈఈ,, కోచింగ్ పేర్లతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని సోమవారం కడప నగరంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) శంషుద్దీన్ కు టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ… జిల్లాలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి అనధికారికంగా అడ్మిషన్ ఫీజుల పేరుతో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు అదనపు వసూళ్లు చేయడమే కాకుండా, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్మ్స్ తదితర వస్తువులను ఆయా విద్యాసంస్థల వద్దనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ చర్యలు ప్రభుత్వ నిబంధనలకు, విద్యా హక్కు చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. అలానే జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న విద్యాసంస్థలను గుర్తించి వాటి వివరాలను ప్రజలకు తెలపాలని పేర్కొన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని టి ఎన్ ఎస్ ఎఫ్ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేతన్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సిద్ధార్థ రాయల్, అధికార ప్రతినిధి సందీప్, కార్యదర్శులు సుమన్, మధు, కళ్యాణ్, నాగార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.