ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఎక్కడ..?
పొలిటికల్ పవర్ న్యూస్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 19 2026: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిజంగా పాటిస్తున్నాయా అనే ప్రశ్న తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తుండగా, పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర అవసరాల పేరుతో మరో రూ.10 వేల వరకు అదనపు భారం మోపుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కష్టార్జిత సంపాదనలో...