POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:40 pm Posted by : POLITICAL POWER

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి 

– మాజి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో
 యస్.ఈశ్వర్ఆగస్టు07.2026.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిఆర్ ఎస్ పార్టీ  మాజి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి అన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92.వ జయంతి సందర్భంగా గురువారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోనిపట్టణచౌరస్తాలోఆయనచిత్రపటానికిపూలమాలలు వేసి స్వీట్లుతినిపించుకొని ఘనంగాజయంతివేడుకలనునిర్వహించారు.ఈసందర్భంలోవారుమాట్లాడుతూతెలంగాణఆత్మగౌరవాన్నిప్రపంచానికిచాటిచెప్పినమహోన్నత మేధావి, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి, కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగానిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు చిరస్మరణీయాలు, తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ఆయనచూపినమార్గంఎల్లప్పుడూమనకుఆదర్శప్రాయమని అన్నారు.ప్రత్యేక తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజలఆకాంక్షలనునెరవేర్చేందుకు ఆయనజీవితాంతంచేసినకృషిభావితరాలకు ఆదర్శంగానిలుస్తుందనిపేర్కొన్నారు.ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలోఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, కౌన్సిలర్లు నారమన్ అయ్యన్న,
తిరుపతయ్య ,  ముంత రామకృష్ణ, సీనియర్ నాయకులు శ్రీనివాస్ జి, యుగంధర్ రెడ్డి పామపురం, సత్యం యాదవ్,  ప్రేమ దానం, బాలకృష్ణా రెడ్డి, బాబా, యువ నాయకులు వికాస్, మహేష్, రాజ్ కుమార్,పద్మ  నేహరు, సాధిక్ , సర్పరాజు, సద్దాం , వాజిద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్ని ఘన నివాళులు అర్పించినారు.