POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 4:01 pm Posted by : POLITICAL POWER

ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధి కి కృషి చేయాలి –తెలంగాణ ఉద్యమకారులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి పట్టణం పెబ్బేర్ రోడ్ లో జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఉద్యమకారులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు నిధుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి సాగించిన పోరాటం ఫలితంగా తెలంగాణ స్వరాష్ట్రకల సాకారం అయిందన్నారు. రాష్ట్రం ఏర్పడి 12,13 ఏళ్లయిన నీళ్లు నియామకాల విషయంలో అరె కొర అములు తప్ప ఆయన అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదన్నారు. జయశంకర్ సార్ జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసి పోరాడిన గొప్ప వ్యక్తి అని, ఆంధ్ర పాలకులు ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్ని నిర్బంధాలు విధించిన ఆయన ఉద్యమంలో వెను తిరగలేదన్నారు. తెలంగాణ ప్రజల్లో ఆయన రగిలించిన చైతన్యంతోనే మలిదశ ఉద్యమం విజయవంతమైందని ఆయన మహానుభావుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించిందని, అధికారంలోకి వచ్చేందుకు ఉద్యమకారులకు తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చినా మూడేళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదని, కమిటీల పేరుతో కాలయాపన జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించి వారికి తగిన గౌరవం, ఎదగటానికి సహకారం అందించాలన్నారు. ఇది కూడా జయశంకర్ సార్ ఆశయంలో ఒక భాగమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఖాదర్ పాషా, యాదగిరి, సత్యం సాగర్, రమేష్, లతీఫ్, యోగానంద రెడ్డి, తిరుపతయ్య యాదవ్, నిరంజన్ వలి, రాము, ఆనంద్ శర్మ, రామాంజనేయులు, బండలయ్య, గువ్వల చెన్నయ్య, చీర్లజనార్ధన్, టప్ప మురళి, కిరణ్ కుమార్, షఫీ, గోపాలకృష్ణ, మురళి, రమేష్, రతన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.