POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 3:50 pm Posted by : POLITICAL POWER

ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధికోసమై కృషి చేయాలి


పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21.2026.

తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సిద్ధి కోసమై కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు అన్నారు. ఆదివారం జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నూతనంగా మెడికల్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఉద్యమ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలైన తెలంగాణ ఏర్పాటు చేసుకున్న నీళ్లు నిధుల విషయంలో కొంతవరకు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకొని 12,13 ఏళ్లయిన నియామకాల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని జయశంకర్ సార్ ముఖ్య ఆశయం నియామకాలే అన్నారు. జయశంకర్ సార్ జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసి పోరాడిన గొప్ప వ్యక్తి అని, ఆంధ్ర పాలకులు ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్ని నిర్బంధాలు విధించిన ఆయన ఉద్యమంలో వెను తిరగలేదని విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు చైతన్యాన్ని రగిలించిన మహానుభావుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నిస్వార్ధంగా తెగించి పోరాటం చేసిన ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించిందని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం ఇస్తామని వాగ్దానం చేసిందని ఇప్పటికీ మూడేళ్లు గడుస్తున్నా కొలిక్కి రాలేదని కమిటీల పేరుతో కాలయాపన జరుగుతుందని ఈ విషయంపై వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఇది కూడా జయశంకర్ సార్ ఆశమే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఖాదర్ పాషా, యాదగిరి, సత్యం సాగర్,రమేష్,లతీఫ్, యోగానంద రెడ్డి, తిరుపతయ్య యాదవ్, నిరంజన్ వలి,రాము,ఆనందుశర్మ,రామాంజనేయులు,బండలయ్య, గువ్వల చెన్నయ్య, చీర్లజనార్ధన్, టప్ప మురళి,కిరణ్ కుమార్,షఫీ,గోపాలకృష్ణ, మురళి,రమేష్,రతన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.