Date of Publish : 11 September 2026, 5:13 pmPosted by : POLITICAL POWER
ఫారం 6 ద్వారా యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి
పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక, వనపర్తి జిల్లాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: శర్వాణి డిఈడి కాలేజ్ లో సర్ ప్రోగ్రామ్ మిద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ముఖ్య అతిధులు గా పాల్గోని మట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సాహితీ కళా వేదిక, వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ప్రతి ఒక్కరి ఓటేనని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ఓటు హక్కు అనేది హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా అన్నారు. నేటి యువతే రేపటి భారతదేశానికి పునాది కావున యువత అందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం “ఫారం 6” ను అందుబాటులో ఉంచిందని, ఫారం 6 ద్వారా ఆన్‌లైన్‌లోనే చాలా సులభంగా పేరు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. దగ్గరలోని BLO ను కలిసి ఆఫ్‌లైన్‌లో కూడా ఫారం 6 సమర్పించవచ్చని తెలిపారు. ఆధార్ కార్డు, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే చాలని, పేరు నమోదు చేసుకున్న తర్వాత EPIC కార్డు అంటే ఓటర్ ID ఇస్తారని వివరించారు. చాలా మంది యువత ఓటు విలువ తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, “మా ఒక్క ఓటుతో ఏమవుతుంది” అనుకుంటే అది ప్రజాస్వామ్యానికి నష్టమని అన్నారు. మంచి నాయకులను ఎన్నుకోవడానికి, అవినీతిని అరికట్టడానికి ఓటు చాలా అవసరమని యువత గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి యువతీ యువకుడు 18 ఏళ్లు నిండిన వెంటనే ఫారం 6 నింపాలని, ఓటు వేయండి, మీ హక్కును వినియోగించుకోండి, దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. ఓటు వేయకపోవడం కూడా ఒక తప్పే అని శంకర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు కవి జనజ్వాలా, సినారే అవార్డు గ్రహీత, సత్తార్ సామాజికవేత గంధం నాగరాజు, డైరెక్టర్ దేశీ రాములు, యువ కవి తిరుమలేష్, రాము, డైరెక్టర్ తిరుపతి రెడ్డి, పిఈటి వెంకటేష్, కళాశాల లెక్చరర్ నాగ రాజు, ప్రవీణ్ కుమార్, కళాశాల విద్యార్థులు, తధితరులు పాలుగొన్నారు.