ఫీజు బకాయిలపై బీజేవైఎం ధర్నా కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టిపూళ్ళ దుర్గా శ్రీనివాసరావు
రూ.15 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి.. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలిపొలిటికల్ పవర్, ఆగస్టు 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా( బీజేవైఎం) ఆధ్వర్యంలో ఫీజులు బకాయి బిజెపి లడాయి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గొట్టిపూళ్ళ దుర్గా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు....