పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: మదనాపూర్ మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా మూడవత్ రవినాయక్ ను నియమించడం జరిగింది. బంజారా సమాజ అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ, యువతను ఐక్యం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ నియామకం చేపట్టినట్లు బంజారా సేవా సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా అధ్యక్షులు నేనావత్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ… మదనాపూర్ మండలంలో బంజారా సేవా సంఘాన్ని మరింత బలోపేతం చేసి, ప్రతి తండా మరియు గ్రామంలోని బంజారా ప్రజలను సంఘటితం చేయాలని ఆకాంక్షించారు. బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ బంజారా మాట్లాడుతూ… బంజారా సమాజ ఐక్యత, అభివృద్ధి మరియు హక్కుల సాధన కోసం ప్రతి మండలంలో సంఘం చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు మూడవత్ రవినాయక్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంఘం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం వనపర్తి జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని నూతన మండల అధ్యక్షులు మూడవత్ రవి నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు.