పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీపై వెళ్తున్న అధికారులకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ శాఖ ఏఈ స్వాతి, ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎం కౌసల్య, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో ) మధు గ్రామ అభివృద్ధికి అందించిన సేవలను కొనియాడుతూ గ్రామపంచాయతీ పాలక మండలి సభ్యులు వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా వారి స్థానాల్లో బాధ్యతలు స్వీకరించనున్న అధికారులకు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ… గ్రామ ప్రజల సంక్షేమం కోసం అధికారులు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో వారు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములమ్మ హనుమంతు, వార్డు సభ్యులు కృష్ణ, నరేష్, యాదమ్మ, పద్మ, భాస్కర్, మాజీ ఎంపీటీసీ ఇందిరాలక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ తిక్కన్న, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.