POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 7:09 pm Posted by : POLITICAL POWER

బద్వేల్ సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ నీ సస్పెండ్ చేయాలి.

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వెంకటేశ్వర్లు కడప జిల్లా ద్వేల్ పట్టణంలో సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ ని సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ….. సబ్ రిజిస్టర్ గా పని చేస్తున్న విద్యాసాగర్ గతంలో ప్రొద్దుటూరులో సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న సందర్భంలో అనేక అక్రమ భూ రిజిస్ట్రేషన్లు పాల్పడ్డాడని ఆయన పైన కేసు నమోదు అయిందని వారు గుర్తు చేశారు. అదే కాకుండా అనేక రకాల అవినీతికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదే రీతిలో బద్వేలు పట్టణంలో కూడా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక భూ దందాలు అక్రమార్కులకు అండగా నిలుస్తూ నకిలీ పట్టాలు సృష్టిస్తూ నకిలీ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న సంఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి. వీటిపై జిల్లా ఉన్నతాధికారులు ఆయన పైన సమగ్ర విచారణ జరిపి ఆయనను సస్పెండ్ చేసి తక్షణమే ఆయనను అరెస్టు చేసి ఎంక్వైరీ కమిటీ ఆయన పైన వేసి బాధితులకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆయన పైన జిల్లా అధికారులు విచారణ చేయకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడుతామని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్ బద్వేల్ పట్టణ కార్యదర్శి ఎస్ కే ఆదిల్ పట్టణ ఉపాధ్యక్షుడు నాగేంద్ర నాయకులు సుభాన్ తదితరులు పాల్గొన్నారు