*బయలువీరభద్రస్వామివారి విశేషపూజలు
నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 8 (పొలిటికల్ పవర్ న్యూస్) ఈ రోజు ఉదయానికి అమావాస్య ఘడియలు రావడంతో శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహిస్తున్నది. ఈ సాయంకాలం పూజాదికాలు నిర్వహించబడుతాయి ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో ఈ విశేషార్చనను జరిపించడం జరుగుతోంది. కాగా అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించబడింది. కాగా ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించబడుతుంది. ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం,...