*బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం*

  నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 4 (పొలిటికల్ పవర్ న్యూస్) లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (04.11.2026) సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది. ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి. బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో...