POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 11:39 pm Posted by : POLITICAL POWER

*బలభద్రపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణి కార్యక్రమం*

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్ 9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినీధి మే 01: తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో నిర్వహించిన “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్ల పంపిణి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. బిక్కవోలు మండలానికి సంబంధించి మంజూరైన వితంతు పెన్షన్లను మొత్తం 7 మంది లబ్ధిదారులకు పంపిణి చేశారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెన్షన్లు వారి జీవనోపాధికి ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. వితంతువులకు ఆర్థికంగా అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమని, ఇటువంటి పథకాలు సమాజంలో బలహీన వర్గాలకు భరోసా కల్పిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కూటమి నాయకులు, బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.