*బలభద్రపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణి కార్యక్రమం*

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్ 9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినీధి మే 01: తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో నిర్వహించిన “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్ల పంపిణి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. బిక్కవోలు మండలానికి సంబంధించి మంజూరైన వితంతు పెన్షన్లను మొత్తం 7 మంది లబ్ధిదారులకు పంపిణి చేశారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు...