POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 8:43 pm Posted by : POLITICAL POWER

బలభద్రపురంలో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు 12న ప్రత్యేక పూజలు – సుందరకాండ పారాయణం – మహా అన్నప్రసాద వితరణ

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే10:

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారి హనుమజ్జయంతి మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ మంగళవారం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి స్వామి వారికి మహన్యాసపూర్వక అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ హనుమంతుని మహిమను చాటిచెప్పే పవిత్రమైన శ్రీ సుందరకాండ పారాయణ కార్యక్రమం జరగనుంది.
అలాగే ఉదయం 11 గంటల నుండి ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. తీర్థప్రసాదాలు స్వీకరించి హనుమంతుని కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.